భారతదేశం, మే 19 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 19 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 19 ఎపిసోడ్ లో.. మరో హాస్పిటల్ లో శ్రీవల్లికి చెకప్ చేయించాలని నర్మద షాక్ ఇస్తుంది. వేదవతి, రామరాజు కూడా అదే మాట చెప్పేసరికి శ్రీవల్లి ఒప్పుకొంటుంది. రెడీ అవుతానని లోపలికి వెళ్తుంది. బొమ్మల కొలువులా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని రామరాజు వేదవతితో అంటాడు.

మరోవైపు క్యాబ్ యాప్ లో వెహికల్ రిజిస్టర్ కావడానికి 48 గంటలు పడుతుంది. ట్రావెల్ గ్రూప్ లో కారు ఉందని మెసేజ్ చేశా. చూద్దాం ఎవరైనా వస్తారేమోనని రోడ్డు పక్కన కారు పెట్టుకుని ధీరజ్, ప్రేమ వెయిట్ చేస్తుంటారు. అప్పుడే చేతిలో కవర్లతో భర్త భాస్కర్ ను ఎండలో నడిపిస్తుంది కామాక్షి.. ధీరజ్ ను చూస్తుంది.

ఏరా చిన్నోడా, కారు కొన్నావంటా కదా. నన్ను పిలిచి పూజ చేయించుకోవచ్చు కదా. కొత్త కారు కొన్నప్పుడు అక్కకు పట్టు చీర కొనా...