భారతదేశం, జూన్ 9 -- Illu Illalu Pillalu June 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 9 ఎపిసోడ్ లో.. భద్రావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది ప్రేమ. ధీరజ్ ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తుంది. నర్మద, ప్రేమ కలిసి అదే పని మీద ఉంటారు. ఇంకా ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో చూసేయండి.

ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోతుంది. నేను మళ్లీ ఇంటికి వచ్చేస్తే ధీరజ్ ను కేసు నుంచి విడిపిస్తానని చెప్పావ్ కదా. ధీరజ్ ను విడిపించమని భద్రావతిని అడుగుతుంది ప్రేమ. సేనా, విశ్వ మన ప్రేమ శాశ్వతంగా మన ఇంటికి వచ్చేసిందని భద్రావతి తెగ సంతోషపడిపోతుంది.

ప్రేమ ఏంటే పిచ్చి పని, తాళి కట్టిన భర్తను వదిలేసి వస్తావా? మూడు ముళ్ల బంధాన్ని తెంచేసుకుంటావా? అని శారదాంబ, రేవతి కలిసి బుద్ధి చెప్పాలని చూస్తారు. కానీ వాళ్లను భద్రావతి తిడుతుంది. కూత...