భారతదేశం, జూన్ 19 -- Illu Illalu Pillalu June 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 19 ఎపిసోడ్ లో ధీరజ్ కు కారు కొనివ్వడం కోసం ప్రేమకు ఓ బంపరాఫర్ వస్తుంది. డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. మరి పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కారు తీసుకోవడానికి రూ.10 లక్షలు కావాలి. నెలకు రూ.50 వేల జీతం వస్తే కారు కొనేందుకు రెండేళ్లు పడుతుందని ప్రేమ అనుకుంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. కారు పోయినందుకు బాధ లేదా? అని ప్రేమ అడుగుతుంది. మొన్నటివరకూ డెలివరీ బాయ్ గా పని చేశావ్. కారు కొనుక్కొని ట్రావెల్స్ స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు మళ్లీ మొదటికే వచ్చావని ప్రేమ ఫీల్ అవుతుంది.

కొన్ని రోజులు పోతే మళ్లీ కారు తీసుకుంటాం. ఆ హ్యాపీనెస్ కోసం ఎదురు చూడాలని ధీరజ్ అంటాడు. నగలు తాకట్టు పెడతానంటే వద్దంటావ్,...