భారతదేశం, జూన్ 12 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో సాగుతోంది. టుడే జూన్ 12 ఎపిసోడ్‌లో చందు అడిగిన ఓ ప్రశ్న శ్రీవల్లిని వణికించింది. అసలు ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలైట్స్ మీకోసం.

తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు శ్రీవల్లి, భాగ్యం అండ్ గ్యాంగ్ కూర్చుని తెగ ఆలోచిస్తుంటారు. ధీరజ్ జైలుకు వెళ్లిపోయాడు, ప్రేమ ఏడుస్తుంది. నర్మద వేరు కాపురం పెట్టింది. ఇక నా గురించి పట్టించుకోరని కలలు కన్నానని శ్రీవల్లి అంటుంది.

రౌడీని పట్టుకునేందుకు వెళ్లమని చెప్పింది నువ్వే, ఇప్పుడు క్రెడిట్ నర్మద, ప్రేమకు వెళ్లిందని సుక్కుపై భాగ్యం సీరియస్ అవుతుంది. కానీ రౌడీని పట్టుకోకుండా చేసేందుకు కదా వెళ్లిందని ఇడ్లీ బాబాయ్ అసలు విషయం చెప్పేస్తాడు. మీరు ఈగోకు పోయి సర్వనాశనం చ...