Hyderabad, జూన్ 28 -- కీలక పాత్రలతో అలరిస్తున్నారు నటుడు ఆర్ శరత్ కుమార్. హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ తండ్రి అయిన శరత్ కుమార్ మంచు విష్ణు కన్నప్ప మూవీలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరో సరికొత్త సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ సినిమానే 3 బీహెచ్‌కే.

బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 3 బీహెచ్‌కే. ఈ సినిమాలో శరత్ కుమార్‌తోపాటు దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన 3 బీహెచ్‌కే థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు.

శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో కన్నప్ప నటుడు ఆర్ శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు. ఇల్లు అనేది ఒక గౌరవం లాంటిదని మాట్లాడారు.

యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. "అందరి...