భారతదేశం, జూన్ 13 -- రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, అమెరికా- చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు! ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్​ ప్రకటించింది. అంతేకాదు, తమ దేశవ్యాప్తంగా ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు ఇజ్రాయెల్​ రక్షణ మంత్రి కాట్జ్​ తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున పేలుళ్ల శబ్దాలకు ఇరాన్​లోని టెహ్రాన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుళ్లు జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ సైతం అంగీకరించింది. శుక్రవారం దేశంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు కాట్జ్​ తెలిపారు.

"ఇరాన్​పై ఇజ్రాయెల్​ ముందస్తు దాడుల నేపథ్యంలో మనపై మిసైల్ దాడులు లేదా డ్రోన్​ దాడులు జరగొచ్చు," అని కాట్జ్​ అన్నారు.

ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి తీవ్రత, ప్రాణ నష్టం జరిగిందా? వంటి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

తాజా ఉద్రిక్త...