భారతదేశం, జూన్ 13 -- రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, అమెరికా- చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు! ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్​ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఇరాన్​లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తేల్చిచెప్పింది. అణు బాంబును ఇరాన్​ తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఈ దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. ఇరాన్​ కూడా తమపై దాడి చేసే అవకాశం ఉందంటూ.. ఇజ్రాయెల్​లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఇరాన్​లోని న్యూక్లియర్​ ఎన్​రిచ్​మెంట్​ ప్రోగ్రామ్​పై వైమానికి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహు ప్రకటించారు.

"ఇరాన్​ న్యూక్లియర్​ ఎన్​రిచ్​మెంట్​ ప్రోగ్రామ్​ సెంటర్​లో దాడి చేశాను. ఇరాన్​పై మా దాడులు ఎన్ని రోజులు కొనసాగాలో, అన్ని రోజులు కొనసాగుతాయి," అని నే...