Hyderabad, జూలై 7 -- మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో "బేబి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్‌ఫుల్ యంగ్ నిర్మాత ఎస్‌కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ", హిందీలో "బేబి" సినిమాతో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి.

ఇవాళ (జూలై 7) నిర్మాత ఎస్కేఎన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నిర్మాత ఎస్‌కేఎన్ ప్రొడ్యూసర్‌గా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్‌ను ఇంటర్వ్యూలో తెలిపారు.

-నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాస రచన పోటీలు, డిబేట్స్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచనలు క...