భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రతిభ ఉంటే ఎవరైనా రాణించవచ్చు.. కానీ ఆ ప్రతిభను గుర్తించే లోపు సమాజం పెట్టే కష్టాలు వర్ణనాతీతం. 'పంచాయత్' వెబ్ సిరీస్‌లో కొత్త సెక్రటరీగా కనిపించి మెప్పించిన వినోద్ సూర్యవంశీ ప్రయాణం కూడా అచ్చం ఇలాంటిదే. వెండితెరపై నవ్వుతూ కనిపించే ఈ నటుడి వెనుక గుండెను పిండేసే కష్టాలు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు.

కర్ణాటకలోని తన స్వగ్రామంలో ఇప్పటికీ అంటరానితనం కోరలు చాచుకునే ఉందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో దళితులకు, అగ్రవర్ణాలకు వేర్వేరు నివాస ప్రాంతాలు ఉండటం నేటి ఆధునిక కాలంలోనూ కొనసాగుతుండటం మన సామాజిక వెనుకబాటుతనానికి అద్దం పడుతోంది.

"నేను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్నతో కలిసి ఒక హోటల్‌కు వెళ్లాను. అక్కడ భోజనం చేసినందుకు డబ్బులు చెల్లించడమే కాకుండా, మా ప్లేట్లు మేమే కడుక్కోవాల్సి వచ్చింది. మా ఊరిలోని దేవాలయంలోకి ...