Hyderabad, జూలై 20 -- పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ధర్మం కోసం పోరాయేడ యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీనే హరి హర వీరమల్లు. ఈ సినిమాకు ఏ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఇద్దరు దర్శకత్వం వహించారు.

అగ్ర నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో హరి హర వీరమల్లు సినిమాను నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసిన హరి హర వీరమల్లు జూలై 21న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపేథ్యంలో హరి హర వీరమల్లు సినీ విశేషాలను మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం పంచుకున్నారు.

-17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది.

-హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శ...