భారతదేశం, డిసెంబర్ 12 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం (డిసెంబర్ 11) సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో మెరిశాడు. తనకు సొంతంగా 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) ఉన్నప్పటికీ, సినిమా చూసేందుకు మహేష్ థియేటర్‌కు వెళ్లడం విశేషం. రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమాను చూసిన బన్నీ.. ఆ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

బాలీవుడ్ లో ఈ మధ్యే రిలీజైన దురంధర్ సినిమాకు ఒక్కో సెలబ్రిటీ అభిమానిగా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మూవీ చూసి ఫిదా అయిపోయాడు. శుక్రవారం (డిసెంబర్ 12) ఉదయం బన్నీ 'ధురంధర్' సినిమాపై తన అభిప్రాయాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకున్నాడు.

"ఇప్పుడే 'ధురంధర్' చూశాను. అద్భుతమైన నటన, అత్యున్నత సాంకేతిక విలువలు, మంచి సౌండ్‌ట్రాక్‌లతో రూపొందిన బ్రిలియంట్...