భారతదేశం, సెప్టెంబర్ 16 -- పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'దే కాల్ హిమ్ ఓజీ' అదరగొడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తాచాటుతోంది. ఈ మూవీ విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంది. కానీ సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ చిత్రం ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం (సెప్టెంబర్ 16) కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.

అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సేల్స్ లో పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రికార్డులు తిరగరాస్తోంది. మెల్ బోర్న్ లో ఉన్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో ఓజీ టికెట్లు రెండు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాల్లో ఓజి మూవీ మెల్బోర్న్ ఐమాక్స్ షో ఎలా అమ్ముడయ్యిందో ఫ్యాన్స్ ఎక్స్ లో పంచుకున్నారు.

''దే కాల్ హిమ్ ఓజీ ఒక రికార్డు నెలకొల్పింది! 🚀🔥ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్క్రీన్ అయిన మెల్ బోర్న్ లోని ఐమాక్స్ లో ప్రీమియ...