భారతదేశం, ఆగస్టు 13 -- రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' (Coolie) మూవీ థియేట్రికల్ రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తుంది. గురువారం (ఆగస్టు 14)న రిలీజ్ కానున్న ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ లో అదరగొడుతోంది. తలైవా పవర్ ను చాటుతూ సత్తాచాటుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వీకెండ్ కలెక్షన్లు రూ.100 కోట్లు దాటింది.

కూలీ సినిమా ఫస్ట్ వీకెండ్ రూ.100 కోట్ల మార్కును చేరుకుంది. ఈ మూవీ రిలీజ్ రోజు కోసం ఇప్పటికే రూ.12 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం (ఆగస్టు 13) ఉదయం 11 గంటల వరకు భారతదేశంలో కూలీ సినిమా 12,46,828 టిక్కెట్లను విక్రయించింది. దీని ద్వారా రూ. 27.01 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం తమిళంలో 10 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించగా, తెలుగులో 1 లక్ష టిక...