భారతదేశం, అక్టోబర్ 5 -- సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. ఆయన మూవీ రిలీజైందంటే ప్రపంచ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. తలైవాగా జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆయన చిటికె వేస్తే ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్, ఫుడ్ అన్నీ ఉంటాయి. కానీ సామాన్య ప్రజల్లాగే ఉండటాన్ని ఇష్టపడే రజనీకాంత్ మరోసారి సంప్లిసిటీ చాటుకున్నారు.

రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ 'జైలర్ 2' నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అయితే షూటింగ్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉండటంతో రజనీకాంత్ రిషికేశ్‌లో వారం రోజుల విరామం తీసుకున్నారు. సినిమాకు పూర్తిగా కట్టుబడి ఉండే రజనీకాంత్ ఈ కాస్త సమయంలోనే పవిత్ర స్థలాలకు వెళ్లారు. రిషికేశ్‌లోని ఆశ్రమంలో ఆయన బస చేశారు.

బద్రీనాథ్, బాబా గుహ వంటి ప్రదేశాలకు రజనీకాంత్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...