భారతదేశం, జూలై 28 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్​ను దుర్గ గుడి ఈవో శీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఈవో శీనా నాయక్ తెలిపారు.

"సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం 29 వ తేదీ సోమవారం వచ్చింది. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు," అని ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ.

దుర్గ గుడిలో విజయదశమి రోజు నిర్వహించే కార్యకలాపాలపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు.

"సామాన్యులకు పెద్దపీట వేస్తూ అంద...