భారతదేశం, ఆగస్టు 15 -- విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆలయ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త అన్నదానం, లడ్డూ తయారీ (లడ్డూ పోటు) భవనాలను ఈ నెల 21వ తేదీన వైభవంగా ప్రారంభించనున్నారు.

ఈ నూతన వసతుల ద్వారా అమ్మవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతంగా, శుచిగా రూపుదిద్దుకోనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఆలయ చైర్మన్, ఈవో, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన అన్నదాన కౌంటర్, లడ్డూ పోటు భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆగస్టు 21న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనాల ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు.

సుమారు రూ.25...