భారతదేశం, జూలై 1 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ కారుగా గుర్తింపు తెచ్చుకున్న టయోటా ఇన్నోవా హైక్రాస్​పై బిగ్​ అప్డేట్​! తాజాగా జరిగిన బీఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​)లో ఈ ఎంపీవీ 5 స్టార్​ రేటింగ్​ దక్కించుకుంది. ఈ ఫలితంతో, హైక్రాస్ భారతదేశంలో ఎన్​సీఏపీ ద్వారా రేట్ చేసిన మొట్టమొదటి ఎంపీవీగా నిలిచింది. అంతేకాకుండా, కొత్తగా ప్రవేశపెట్టిడిన భారతీయ భద్రతా మూల్యాంకన కార్యక్రమంలో క్రాష్ టెస్ట్​కు వెళ్లిన మొదటి టయోటా మోడల్ కూడా ఇదే.

ఇన్నోవా హైక్రాస్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 30.47 పాయింట్లు సాధించి, గరిష్టంగా 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ టెస్ట్ రేటింగ్‌లు జీఎక్స్​8-సీటర్ పెట్రోల్, వీఎక్స్​, జెడ్​ఎక్స్​ హైబ్రిడ్ సహా హైక్రాస్ అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్...