భారతదేశం, జూలై 29 -- మెరుగైన చదువు కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు వెళుతుంటారు. అదే విధంగా.. అనేక మంది విదేశీయులు మన దేశానికి వస్తుంటారు. ఇలా వచ్చి.. ఇండియాలో చదువుకున్న వారిలో ప్రపంచ దేశాల నేతలు కూడా ఉన్నారని మీకు తెలుసా? ఈ లిస్ట్​లో కొందరి పేర్లను ఇక్కడ చూసేయండి..

1. హమీద్ కర్జాయ్

2004 నుంచి 2014 వరకు ఆఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేసిన హమీద్ కర్జాయ్.. 1983లో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్​ రిలేషన్స్​, రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన పాలనలో భారత్-ఆఫ్గాన్ సంబంధాలు అనేక విధాలుగా బలపడ్డాయి.

2. బింగు వా ముతారికా

ఆగ్నేయాఫ్రికా దేశమైన మలావి మాజీ అధ్యక్షుడు బింగు వా ముతారికా.. దిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్​ని పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్...