భారతదేశం, జనవరి 21 -- భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ వేదికపై సందిగ్ధతకు ఐసీసీ తెరదించింది. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇండియాలో తమ ప్లేయర్స్ కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్‌లో తమ టీమ్ ఆడే మ్యాచ్ లను శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేసింది. లేదంటే టోర్నమెంట్ నుంచి తప్పుకునే ఆలోచన కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు.

బంగ్లాదేశ్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే ఇండియాలో జరుగుతాయని బుధవారం (జనవరి 21) స్పష్టం చేసింది. టోర్నీల...