భారతదేశం, మే 27 -- ఎలాన్ మస్క్​కి చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్​ స్టార్​లింక్​ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అడుగు దూరంలో ఉంది. భారత ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనేక పర్మీషన్లను పొందింది ఈ సంస్థ. ఇక ఇప్పుడు స్టార్​లింక్​ ప్రైజింగ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియాలో నెలకు 10 డాలర్లు అంటే సుమారు రూ.850తో స్టార్​లింక్​ తన సేవలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత అఫార్డిబుల్​ శాటిలైట్ బ్రాడ్​బ్యాండ్​ ఆఫర్లలో ఒకటిగా మారుతుంది.

దేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రాథమిక అనుమతిని మంజూరు చేస్తూ టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి స్టార్​లింక్ ఇటీవల లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) పొందింది. గతంలో రెగ్యులేటరీ, లైసెన్సింగ్ సవాళ్ల కారణంగా జ...