భారతదేశం, నవంబర్ 9 -- గూగుల్ ఇండియా తమ గూగుల్ మ్యాప్స్‌లో ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ప్రయాణాన్ని మరింత స్మార్ట్‌గా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్‌తో కూడిన కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇటీవలే చేసిన ఒక ప్రకటనలో, ఈ అప్‌డేట్ ద్వారా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెన్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ అలర్ట్స్​, మెరుగైన రోడ్డు భద్రతా సాధనాలు భారతదేశంలోని లక్షలాది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది.

1. జెమినీ ఏఐతో హ్యాండ్స్-ఫ్రీ అన్వేషణ

ఈ కొత్త అప్‌డేట్‌తో, వినియోగదారులు ఇప్పుడు కేవలం "ఓకే గూగుల్​" అని చెప్పి.. హ్యాండ్స్-ఫ్రీగా అన్వేషణను ప్రారంభించవచ్చు. గూగుల్ ఏఐ అసిస్టెంట్ అయిన జెమినీ, వాయిస్ కమాండ్‌ల ద్వారానే సమీపంలోని ప్రాంతాలను కనుగొనడం, ప్రశ్నలు అడగడం లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ లైవ్ లొకేష...