భారతదేశం, ఆగస్టు 12 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని, అదృష్టం కలిసి రావాలని అనుకుంటారు. అయితే వాస్తు ప్రకారం పాటించడం వలన ఇవన్నీ సాధ్యం అవుతాయి. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తగ్గుతుంది.

ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సురక్షితంగా ఉండడంతో పాటుగా ప్రశాంతమైన, సంతోషకరమైన ఇంటిని కోరుకుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు ఇంట్లో ఒక్కోసారి నిలవదు. వాస్తు ప్రకారం వీటిని పాటించడం వలన ఈ సమస్య నుంచి బయటపడడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం నీటికి ధన ప్రవాహంతో ప్రత్యేక సంబంధం ఉంది. నీళ్లు నిరంతరం ప్రవహించినట్లయితే, ఇంట్లో నీటిని సరైన దిశలో ఉంచినట్లయితే ఆర్థిక ప్రవాహం కూడా సజావుగా కొనసాగుతుంది. చాలా మంది ఇంటి అందాన్ని పెంచడానికి ఇండోర్ వాటర్‌ఫాల్స్, ఫౌంటెన్లు వంటివి పెడుతూ ఉంటారు...