భారతదేశం, మార్చి 28 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, చాలా మంది ఇంట్లో ప్రతి వస్తువుని కూడా వాస్తు ప్రకారం పెడుతూ ఉంటారు. గ్యాస్ సిలిండర్లను కూడా వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, ప్రతికూల శక్తి లేకుండా ఉంటుంది.

సాధారణంగా మనం వాడుతున్న సిలిండర్‌తో పాటు ఒక ఎక్స్ట్రా సిలిండర్ కూడా పెడుతూ ఉంటాము. అయితే, ఆ ఎక్స్ట్రా సిలిండర్ పెట్టేటప్పుడు వాస్తు నియమాలను పాటించాలి. దిశలను దృష్టిలో పెట్టుకుని ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి. తప్పుడు దిశలో పెడితే మాత్రం ఇబ్బందులు, ప్రతికూల శక్తి ప్రభావం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం సరిగా లేకపోతే సమస్యలు వస్తాయి. గ్యాస్ సిలి...