భారతదేశం, జూలై 19 -- సాధారణంగా మొక్కలు ఇంటికి అందాన్ని ఇస్తాయి. కానీ, మన సనాతన ధర్మంలో కొన్ని మొక్కలకు దైవిక శక్తి ఉందని విశ్వసిస్తాం. వాస్తు శాస్త్రం ప్రకారం, సరైన దిశలో సరైన మొక్కలను నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఈ మొక్కలను నాటడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయి.

శివయ్యకు అత్యంత ఇష్టమైనది బిల్వదళం. ఇంట్లో బిల్వ మొక్కను నాటడం అంటే సాక్షాత్తు శివుడిని ఇంట్లోకి ఆహ్వానించడమే. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. దీనిని ఇంటికి దక్షిణ లేదా తూర్పు దిశలో నాటడం అత్యంత శుభప్రదం.

ధనానికి, రక్షణకు ప్రతీక శమీ వృక్షం. ఇది శని దేవుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్క. దీనిని ఇంటికి తీసుకురావడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఇంటి ఈశాన్య మూలలో శమీ మొక్కను నాటి, ప్రత...