భారతదేశం, జూలై 20 -- ఇంట్లో అలంకరణ కోసం చాలా మంది లోహంతో తయారు చేసిన తాబేలును ఉంచడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, ఫెంగ్షుయ్ శాస్త్రంలో దీనికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. సరిగ్గా చెప్పాలంటే, వాస్తు మరియు ఫెంగ్షుయ్ నిబంధనల ప్రకారం ఇంట్లో లోహపు తాబేలును సరైన దిశలో, సరైన పద్ధతిలో అమర్చితే ఆ ఇంటికి అదృష్టం క్యూ కడుతుంది.

జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, అలాగే ఆర్థికంగా ఊహించని వృద్ధి కనిపిస్తుంది. అయితే ఎక్కడపడితే అక్కడ ఈ తాబేలును పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కొన్ని కఠినమైన నియమాలను పాటించడం తప్పనిసరి.

వాస్తు శాస్త్రం కావొచ్చు లేదా ఫెంగ్ షుయ్ కావొచ్చు, ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన దిశ కేటాయించబడి ఉంటుంది. చాలా మంది తమ లివింగ్ రూమ్‌లో ఎక్కడో ఒకచోట ఈ తాబేలున...