భారతదేశం, నవంబర్ 13 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి కలిగి ఆనందంగా ఉండొచ్చు, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో ఏ బాధ లేకుండా ఉండొచ్చు. చాలా మంది వారి ఇళ్లల్లో పెంచే మొక్కలు, చెట్ల విషయంలో కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను పెంచడం వలన సానుకూల శక్తితో సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.

ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా, అందంగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండే మొక్కల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో మునగ చెట్టు ఏ దిశలో ఉంటే మంచిది? గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా? ఉండకూడదా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి గుమ్మం లేదా ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనవి. వీటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. ...