భారతదేశం, సెప్టెంబర్ 28 -- హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పవిత్ర దినాలలో ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటారు. వారి ఆత్మశాంతి కోసం శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రధానం వంటి కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. అయితే, ఈ సమయంలో కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, ప్రకృతిలోని జీవరాశుల ద్వారా మనకు అందే కొన్ని సంకేతాలు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పితృ పక్ష సమయాల్లో కొన్ని ప్రత్యేక జీవులు కంటపడితే, దానిని మన పూర్వీకులు మన పట్ల చూపించే ప్రేమకు, వారి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు.

పితృ పక్ష వేళ హకస్మాత్తుగా ఏదైనా ఆవు ఇంటి గడప ముందుకు వచ్చి నిలబడితే, దానిని ఎంతో పవిత్రమైన మరియు అదృష్టకరమైన శకునంగా భావిస్తారు. సనాతన ధర్మంలో గోమాతను సాక్షాత్కార దైవంగా కొలుస్తారు. గోమాత శరీరంలో సకల దేవతలతో ...