భారతదేశం, ఆగస్టు 27 -- గ్లోబల్ పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమెరికా నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ప్లేయర్ ట్రేవిస్ కెల్స్ ను ఆమె మనువాడనుంది. వీళ్లద్దరికీ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ టేలర్ స్విఫ్ట్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

టేలర్ స్విఫ్ట్, ట్రేవిస్ కెల్స్ ఎంగేజ్మెంట్ పోస్టు వైరల్ గా మారింది. అమెరికన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు కెల్స్.. పాప్ సింగర్ స్విఫ్ట్ కు ప్రపోజ్ చేసిన ఫొటోలతో పోస్టు షేర్ చేశారు. గులాబీ, తెలుపు పూల తోటలో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఒక ఫోటోలో కెల్స్ ఒక మోకాలిపై కూర్చొని స్విఫ్ట్ వైపు చూస్తూ ఉన్నాడు. మరొక ఫొటోలో స్విఫ్ట్ తన వేలికున్న ఉంగరాన్ని చూపిస్తుంది. ఈ పోస్ట్ కు 'మీ ఇంగ్లిష్ టీచర్, మీ జిమ్ టీచర్ పెళ్లి చేసుకోబోతున్నారు' అని క్...