భారతదేశం, మే 27 -- ఇంగ్లాండ్​ వీధుల్లో కల్లోలం! స్థానిక కాలమానం ప్రకారం సోమవారం జరిగిన లివర్​పూల్​ ప్రీమియర్​ లీగ్​ విక్టరీ పరేడ్​లో ఒక కారు బీభత్సం సృష్టించింది. సంబరాలు చేసుకుంటున్న లివర్​పూల్​ అభిమానులపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 50మంది గాయపడ్డారు. ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఈ కేసులో 53 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శ్వేతజాతీయుడు, బ్రిటీష్, లివర్​పూల్​ ప్రాంతానికి చెందినవాడని వివరించారు.

ఈ విషాదాన్ని "భయంకరమైన సంఘటన" గా అభివర్ణించారు మెర్సీసైడ్ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ జెన్నీ సిమ్స్. అయితే దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని ధృవీకరించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....