భారతదేశం, నవంబర్ 14 -- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నిర్వహిస్తున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్​) 2025 పరీక్ష అడ్మిట్ కార్డులు ఇప్పటికే విడులయ్యాయి. ఇక మిగిలింది పరీక్ష మాత్రమే! ప్రతిష్ఠాత్మక ఐఐఎంలతో పాటు ఇతర ప్రముఖ బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.. నవంబర్ 30, 2025 న దేశవ్యాప్తంగా జరగనుంది.

పరీక్షా తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అభ్యర్థులు అకాడమిక్ రివిజన్‌తో పాటు మైండ్​సెట్​, ప్రశాంతత, సమయ నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. చివరి దశ తయారీలో అభ్యర్థులు సాధారణంగా చేసే పొరపాట్లను నివారించడానికి కొన్ని కీలక సూచనలు చేశారు విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (వీజేఐఎం) డైరెక్టర్ ప్రొఫెసర్ (డా.) భారత్ భూషణ్ సింగ్.

"క్యాట్​ కేవలం మీకు తెలిసిన దాని గురించే క...