భారతదేశం, జూలై 19 -- నీట్​ పీజీ 2025 అభ్యర్థులకు అలర్ట్​! నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​), ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ 2025 పరీక్షా నగరాల వివరాలు జులై 21న దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా తెలుస్తాయని తెలియజేసింది.

జూన్​లో జరగాల్సిన నీట్​ పీజీ 2025 ఆగస్ట్​ 3కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక జూన్ 13 నుంచి 17 వరకు అభ్యర్థులు తమ పరీక్షా నగరం ఎంపికలను తిరిగి సమర్పించడానికి ఎన్​బీఈఎంఎస్​ అనుమతి ఇచ్చింది.

నీట్ పీజీ 2025 అడ్మిట్ కార్డులు జులై 31న విడుదలవుతాయి. వీటిలో ఇతర వివరాలతో పాటు అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాల చిరునామాను తెలుసుకోవచ్చు.

ఏవైనా సందేహాలు ఉంటే, అభ్యర్థులు ఎన్​బీఈఎంఎస్​ హెల్ప్‌లైన్ నెంబర్ +91-7996165333 ని ఉదయం 9:30 నుంచి ...