భారతదేశం, డిసెంబర్ 15 -- రజాకార్ మూవీ తెలుసు కదా. గతేడాది మార్చిలో రిలీజైన సినిమా ఇది. దీనిపై తాజాగా డైరెక్టర్ వేణు ఊడుగుల వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఈ మూవీని బీజేపీ తీసిందని, పూర్తిగా ఓ పొలిటికల్ ఎజెండాతో తీశారని విమర్శించాడు. గుల్టె ప్రొకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ ఇంటర్వ్యూలో వేణు ఊడుగులను రజాకార్ మూవీ గురించి అడిగినప్పుడు తాను ఆ సినిమా చూడలేదంటూనే.. ఓ పొలిటికల్ ఎజెండాతో తీసిన మూవీ అని అనడం గమనార్హం.

"రజాకార్ అనే సినిమాను ఎవరు తీయించారు. బీజేపీ వాళ్లు తీసిన సినిమా. పూర్తిగా ఓ పొలిటికల్ ఎజెండాతో వచ్చింది. చరిత్ర మీద ప్రేమతోనో.. చరిత్ర మీద భాద్యతతో ఈ జనాలకు చెప్పాలనుకొని తీసిన సినిమా అది. ఓ ఫిల్మ్ మేకర్ గా ఆ డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను గౌరవిస్తా, అభినందిస్తా. కానీ వాళ్...