భారతదేశం, సెప్టెంబర్ 9 -- టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల పెళ్లి చర్చలు జరుగుతున్నాయా? బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ కన్ఫామ్ అయిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. వినాయక చవితి సంబరాల్లో భాగంగా కార్తీక్ ఆర్యన్ ఇంటికి హీరోయిన్ శ్రీలీల, ఆమె తల్లితో కలిసి అటెండ్ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడీ ఫొటోలు వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన రెండు ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఇందులో కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో హీరోయిన్ శ్రీలీల, ఆమె తల్లి ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫొటోలతో ఈ రూమర్లు నిజమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. వీళ్ల పెళ్లి కూడా కన్ఫామ్ అంటూ నెటిజన్లు రియాక్టవుతున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ముంబయ...