భారతదేశం, అక్టోబర్ 31 -- ఓజీ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్లో నటించిన మూవీ 'హక్' (Haq). ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇస్లాంలో విడాకుల పద్ధతిని ప్రశ్నిస్తూ సాగే ఈ సినిమాపై ఓ వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించిన యామీ గౌతమ్ స్పందించింది.

హక్ మూవీ సెన్సార్ గురించి నటి యామీ గౌతమ్ టైమ్స్ నౌతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె యూఏఈ సెన్సార్ గురించి మొట్టమొదటిసారిగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

"ఈ సినిమాకి యూఏఈలో సెన్సార్‌పరంగా ఎటువంటి కట్స్ లేకుండా, '15 ప్లస్' సర్టిఫికేట్ లభించింది. అంటే ఇది అందరూ చూడదగిన సినిమా. అక్కడ ఎలాంటి సమస్య లేదంటే ఈ సినిమా ఏ మతాన్నీ విమర్శించడానికి తీయలేదని అర్థం" అని ఆమె నొక్కి చెప్పింది.

"సినిమా విడుదల కాకుండా దీనికి మించి సాక్ష్యం ఇవ్వ...