Hyderabad, జూన్ 23 -- తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటోంది కుబేర మూవీ. హౌస్ ఫుల్ బుకింగ్స్‌తో సూపర్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న కుబేర సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్‌ను ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుకలో నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. చిరు గారు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. థాంక్ యు సర్. ఈ సినిమా కథ విన్న తర్వాత సెట్స్‌కు వెళ్లి డైరెక్టర్ గారికి సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యా...