భారతదేశం, ఫిబ్రవరి 19 -- డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో ఫాంటసీ డ్రామా 'లోకా: చాప్టర్ 1' గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నటి కల్యాణి ప్రియదర్శన్ 'చంద్ర/నీలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించి తన కెరీర్‌లోనే బెస్ట్ బ్రేక్ అందుకుంది. నస్లెన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 303.67 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో కల్యాణి ప్రియదర్శన్ 'లోకా: చాప్టర్ 2' (Lokah: Chapter 2) గురించి ఆసక్తికర అప్‌డేట్ పంచుకుంది. ఈవెంట్ యాంకర్ సీక్వెల్ గురించి అడగగా.. "నిజం చెప్పాలంటే, నాకు తెలిసినంతవరకు సెప్టెంబర్ నెలకల్లా షూటింగ్ ప్రారంభం కావాలి. రెండవ భాగంలో కూడా నేను కచ్చితంగా ఉంటాను. కాబట్టి దయచేసి వెయిట్ చేయండి" అని ఆమె చిరు...