భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఆసియా గేమ్స్​ 2026లో భారత క్రీడా బృందం బోణీ కొట్టింది. టోర్నీ ప్రారంభమైన నాలుగో రోజు భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు.. భారత్​కు తొలి గోల్డ్​ మెడల్​ని అందించింది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో శ్రీలంకపై 147 పరుగుల వ్యత్యాసంతో ఘన విజయం సాధించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

2023 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్, ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ తర్వాత వరుసగా మూడోసారి శ్రీలంకను చిత్తు చేసి భారత మహిళలు తమ ఆధిపత్యాన్ని పునరావృతం చేశారు.

ఆసియా గేమ్స్ 2026​ మహిళల క్రికెట్​ ఫైనల్​లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఊహించని శుభారంభాన్ని ఇచ్చారు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ పవర్‌ప్లేలోనే ఏకంగా 67 పరుగులు చేశారు. ఐదో ఓవర్లోన...