భారతదేశం, జూలై 31 -- ఆషాఢ మాసం అంటే చాలా మంది శూన్య మాసం అని, ఇది మంచిది కాదని అనుకుంటారు. కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలోని నాలుగో నెల. ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాడు.

ఉత్తరాయణం పూర్తై, ఈ మాసం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలవయ్యింది. అలాగే ఆషాఢ మాసం నుంచి వర్షాలు కురవిస్తాయి.

ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదని, దీనిని శూన్య మాసంగా భావిస్తారు. అందుకే వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను ఈ నెలలో నిర్వహించరు. అయితే ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే మంచిదేనని చెబుతారు. గృహ నిర్మాణాన్ని మొదలుపెడితే పశుసంపద, రత్నాలు, మాణిక్యాలు, ధనధాన్యాలు లభిస్తాయని ...