భారతదేశం, జూలై 14 -- బిట్​కాయిన్​ ఇన్వెస్టర్స్​కి పండగే! ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. సోమవారం నూతన గరిష్ఠాలను తాకింది. తాజాగా, మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్​ని దాటింది. అమెరికాలో కీలకమైన 'క్రిప్టో వీక్​'కి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ మార్కెట్​లో మంచి జోష్​ నెలకొంది!

కాయిన్​మార్కెట్​క్యాప్​ డేటా ప్రకారం.. ప్రస్తుతం బిట్​కాయిన్​ 2.75శాతం వృద్ధిచెంది 1,21,097.94 డాలర్ల వద్ద ఉంది. బిట్​కాయిన్​ మార్కెట్​ క్యాపిటలైజేషన్​ 2.85శాతం పెరిగి 2.41 ట్రిలియన్​ డాలర్లకు చేరింది.

మొత్తం మీద చూసుకుంటే, ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్​కాయిన్​ ఈ ఏడాది ఇప్పటికే 29శాతం వృద్ధిని నమోదు చేసింది.

మరోవైపు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇథేరియం 3.28శాతం పెరిగి 3,054.96 డాలర్లకు చేరింది.

అమెరికా కాంగ్రెస్​లో రానున్న ...