భారతదేశం, జూన్ 2 -- జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని బుద్ధి కారకుడిగా, వ్యాపార ప్రదాతగా భావిస్తారు. ఈ గ్రహాల రాకుమారుడు తన నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశి అయిన మిథునంలో మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈరోజు అనగా జూన్ 2 మంగళవారం ఉదయం 06:14 గంటలకు బుధుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.

ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కావడం విశేషం. బుధుడు, రాహువుల ఈ నక్షత్ర సంబంధం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగం పట్టబోతోంది. జూన్ 10 వరకు ఈ రాశుల వారు మునుపెన్నడూ లేని విధంగా లాభాలను అందుకుంటారు. ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

బుధుడి నక్షత్ర మార్పు సింహ రాశి వారికి విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఆఫీసులో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల బాధ్యత...