Hyderabad, సెప్టెంబర్ 29 -- దసరా పండుగను తొమ్మిది రోజులు పాటు జరుపుతారు. మొదట మూడు రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు, ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజిస్తారు. మనం జీవితంలో కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే సరస్వతీ దేవిని పూజిస్తే మంచిది. సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానం, విద్యా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యమైనది, అదేవిధంగా వృత్తి కూడా చాలా ముఖ్యం.

అయితే పనులు చేసే ప్రతి ఒక్కరూ కూడా వారి పనిముట్లను భగవంతుడు ముందు పూజించే సాంప్రదాయం ఒకటి ఉంది. దానినే ఆయుధ పూజ అని అంటారు. ఆయుధ పూజ నాడు వాహనాలను, ఆయుధాలను శుభ్రంగా కడిగి పూజ చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తారు.

దసరా పర్వదినాన ఆయుధ పూజలు జరుపుతూ ఉంటారు. రావణుడిని వధించే ముందు రాముడు కూడా ఆయుధాలను పూజించాడని పురాణాలు చెబుతున్నాయి....