భారతదేశం, ఆగస్టు 10 -- మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సైయారా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రికార్డు కలెక్షన్లలో దుమ్ము రేపింది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రికార్డు నెలకొల్పింది. ఈ మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ సెన్సేషన్స్ గా మారిపోయారు. సినిమాలో వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు వారి ఆఫ్-స్క్రీన్ స్నేహం కూడా ఫ్యాన్స్ ను మరింతగా ఆకర్షిస్తోంది.

సైయారా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అహాన్, అనీత్ మధ్య లవ్, కెమిస్ట్రీ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అనీత్ తలపై ముద్దు పెట్టాడు అహాన్ పాండే. వీడియోలో అనీత్ తో పాటు అక్కడున్న వాళ్లందరూ సైయారా టైటిల్ ట్రాక్ పాడుతున్నారు. అది గ్లోబల్ చ...