భారతదేశం, ఆగస్టు 11 -- ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రిటీల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రానా దగ్గుబాటి కూడా ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఆన్‌లైన్ బెట్టిం, జూదం యాప్ లను ప్రమోట్ చేయడం, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సినీ ప్రముఖలను ఈడీ విచారిస్తోంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ల దారుణాల కారణంగా యువత ప్రాణాలు కోల్పోతోంది. దీనిపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఈ యాప్ లకు ప్రచారం చేస్తూ డబ్బులు తీసుకున్న సినీ సెలబ్రిటీలపై కేసులు పెట్టారు. మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీకి జులైలో నోటీసులు జారీ చేసింది. ప్రకాశ్ రాజ్, విజయ్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ...