భారతదేశం, సెప్టెంబర్ 10 -- జీవితంలో ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలు, విజయాలను కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మనిషి జీవితాన్ని సులభతరం చేసేందుకు, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అమూల్యమైన సూత్రాలను అందించారు. నేటి ఆధునిక కాలంలోనూ ఆయన చెప్పిన జీవన సూత్రాలు ఎంతో ఆచరణీయంగా నిలుస్తున్నాయి. మనిషి జీవితంలో అత్యంత వేదనను మిగిల్చే మూడు ప్రధాన పరిస్థితులను చాణక్యుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

జ్ఞానం లేకపోవడం లేదా మూర్ఖంగా వ్యవహరించడం మనిషి జీవితంలో అతిపెద్ద శాపమని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు. సమాచారం, సరైన అవగాహన లోపించినప్పుడు మనిషి అడుగులు తప్పుదారి పడతాయి. దీనివల్ల జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా, వ్యాపారం...