Hyderabad, ఆగస్టు 21 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీనితో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. బుధ సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆగస్టు 30 సాయంత్రం 4:39కి బుధుడు సింహరాశిలోకి అడుగు పెడతాడు. అయితే నీడ గ్రహమైనటువంటి కేతువు, సూర్యుడు కూడా ఇప్పటికే సింహ రాశిలో ఉన్నారు.

దీంతో బుధ-సూర్య-కేతువుల సంయోగం చోటు చేసుకుంటుంది. ఈ మూడు గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ మహా సంయోగం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారికి ఈ మూడు గ్రహాల సంయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ ...