భారతదేశం, ఆగస్టు 24 -- ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యాలను ఆస్వాదించే వారికి త్వరలోనే ఒక అద్భుతమైన అవకాశం రానుంది. ఈ ఏడాదికి సంబంధించి రెండోది, చివరిది అయిన చంద్రగ్రహణం ఆగస్టు 28న ఆవిష్కృతం కానుంది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఇది ఒక పాక్షిక చంద్ర గ్రహణం (Partial Lunar Eclipse). ఈ సమయంలో భూమి నీడ చంద్రుడి ఉపరితలంపై దాదాపు 96 శాతం భాగాన్ని కమ్ముకోనుంది.

సాధారణంగా గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కనుమరుగవుతాడని భావిస్తుంటాం. కానీ ఈ చంద్రగ్రహణ వేళ చంద్రుడు పూర్తిగా నల్లగా మారిపోకుండా, అరుదైన తామర పువ్వు లాంటి కెంపు రంగులోకి లేదా ముదురు నారింజ రంగులోకి మారుతాడు. భూ వాతావరణం గుండా ప్రయాణించి, వంగి వచ్చే సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడటం వల్లే ఈ అద్భుతమైన రంగు ఆవిష్కృతమవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సర...