Hyderabad, ఆగస్టు 17 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. న్యాయదేవుడు శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడు ఫలితాలను తప్పక ఎదుర్కోవాలి.

గ్రహాల స్థానాన్ని బట్టి మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కేవలం కెరియర్ పరంగానే కాకుండా డబ్బు, సంతోషం ఇవన్నీ కూడా గ్రహాల ఆధారంగా జరుగుతాయి.

ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26న ఉదయం 6:23కి శుక్రుడు, శని 120 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే విధంగా, శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు బుధుడితో లక...