Hyderabad, ఆగస్టు 21 -- అమావాస్య తిధికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులోనూ శని అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనివారం లేదా సోమవారం వచ్చే అమావాస్యకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఈసారి వచ్చే శని అమావాస్య చాలా విశేషమైనది. ఆ రోజే పోలాల అమావాస్య కూడా.

శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్య ఆగస్టు 23న వచ్చింది. శనివారం రావడంతో దీని విశిష్టత ఇంకా పెరిగింది. అయితే శని అమావాస్య నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి విషయాలను తెలుసుకుందాం.

ప్రతి ఏటా 12 అమావాస్యలు వస్తాయి. ఈసారి అమావాస్య శనివారం వచ్చింది. దీనిని శనీశ్చరి లేదా శని అమావాస్య అని అంటారు. శని అమావాస్య నాడు శని దేవుడుని ప్రసన్నం చేసుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. శని దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

గమనిక : ఈ కథన...