Hyderabad, ఆగస్టు 18 -- హిందువులు అమావాస్యను ఎంతో ముఖ్యమైన తిథిగా భావిస్తారు. అమావాస్య నాడు పూర్వికులకు ఆత్మశాంతి కలగాలని కొన్ని పరిహారాలను పాటిస్తారు, దానధర్మాలు చేస్తారు. పవిత్ర నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఇదిలా ఉంటే ప్రతి అమావాస్య ఎంతో విశిష్టమైనది. కానీ శనివారం లేదా సోమవారం వచ్చే అమావాస్యకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ముందున్న అమావాస్య శనివారం వచ్చింది. శని అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చు.

శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ అమావాస్య ఆగస్టు 23న వచ్చింది. ఇది శనివారం రావడంతో దీని విశిష్టత ఇంకా పెరిగింది. శని అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన శని దేవుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు.

శని దోషంతో బాధపడుతున్న వారు, శని దేవుని అనుగ్రహం కలగాలనుకునే వారు శని అమావాస్య నాడు...