Hyderabad, ఆగస్టు 18 -- ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే చివరి రోజు, అంటే కృష్ణపక్ష అమావాస్య నాడు, పోలాల అమావాస్య జరుపుకుంటాము. ఈసారి పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది? పోలాల అమావాస్య తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేయాలి? పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? వారి భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? వంటి వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

ఈసారి పోలాల అమావాస్య ఆగస్టు 23న వచ్చింది. ఆ రోజున గ్రామదేవతలను ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. సంతానం అభివృద్ధి చెందడంతో పాటుగా సంతాన రక్షణ కలుగుతుంది. అమావాస్య ఉదయం 11:17 వరకు ఉంది.

అమావాస్య ఎప్పుడైనా శనివారం నాడు వస్తే దానిని శని అమావాస్య అని అంటారు. ఈసారి పోలాల అమావాస్య, శని అమావాస్య కూడా.

పల్లెటూర్లలో పోలాల అమావాస్యను పశువుల పండుగగా జరుపుకుంటారు. ఆ రోజున ఎడ్లను పూజించే సంప్రదాయం ఉంది.

పిల్ల...